నా ఆలొచనలు... అశ్వాలు
ఆనందానికి అర్రులు చాస్తాయ్
అనుభూతి రెక్కలు ధరిస్తాయ్
భువినుండీ దివికెగరాలంటాయ్
అనంతలోకాలక దౌడుతీస్తాయ్
నా ఆలోచనలు... అశ్వాలు
అన్యాయాన్ని చూసి చలిస్తాయ్
న్యాయంకోసం సకిలిస్తాయ్
ఆవేశాన్ని మేస్తాయ్
ఆపై రౌద్రంగా కదంతోక్కుతాయ్
