Monday, August 24, 2009

కొన్ని కవితలు

నాకు తెలుగు బాషన్న, రచనలన్న చాల అభిమానం. మంచి సాహిత్యం వున్నా పాటలంటే చెవి కోసుకున్తాననుకోండి. ఈ మధ ఒక రాత్రి నా బుర్రలో కవితా త్రిష్ణ పెరిగి ఏదో రెండు కవితలు కెలికాను. నేను ఏదో మా ఆవిడను (తనకు తెలుగు చదవటం తప్ప వ్రాయటం రాదు మరియు సెంట్రల్ స్కూల్ చదువు) మాయ చెయ్యటానికి కాలేజీ లో కొన్ని వ్రాసాను. మళ్ళీ ఇన్ని రోజుల తరువాత కొంచం యాంత్రికమైన జీవితం లో మార్పు తేవాలని సాహిత్యం చదవటం చేస్తున్నాను. ఆ వూపులో వ్రాసిన రెండు కవితలు. పొరపాటున ఎవరైనా చదివితే మీ అభిప్రాయాని తప్పకుండా చెప్పండేం...

జోలపాట
అయ్యో...
ఆ బిడ్డడు...
అలా ఎడుస్తున్నాదేంటి?
"ఒసే ఎంకినీ బిడ్డ ఏడుస్తున్నాడు"
"వత్తనానమ్మగోరు"
జానకి ఆలపిస్తోంది...
శ్రావ్యంగా...
ఇళయరాజా గారి బానీ కి...
"వటపత్ర సాయి కి..." అంటూ
"ఏంటే ఎంకి?"
"ఇంత మంచి పాట వస్తోంటే నీ బిడ్డ ఎడుస్తున్నాదేంటి?"
"వూరుకో బిడా...మియమ్మన్రా...వూరుకో నేనోచేసా"
అరె!!!

దుడ్డ్లు
ఏం దుడ్లియ్యి?
ఇంత మాయ జేసినాయి?
మా అమ్మ, అయ్యా అక్కడ,
మా తమ్ముదింకో దిక్కున,
నేను, నా పెండ్లామిక్కడ.

కన్నేందుకు అన్నట్లు,
వారానికి ఒగాసారి,
ఫోనులో మాటలు.
ఎమిబ్బందోచ్చినా
ఎవురి బాదలోల్లయ్యి

ఏం బతుకిది
ఇంతన్నాయమైపోయింది
ఆ సేద్దేమే బాగుండేది
అందరం గలిసి,
అందరికోసమన్నిట్లున్తిమి

ఏం దుడ్లియ్యి?
ఇంట మాయ జేసినాయి?

ఆంద్ర అన్నదాతల పరిస్థితి

ఒక రైతు బిడ్డనైనా నేను వ్యవసాయం చెయ్యటం లేదు కానీ, వ్యవయాసం మీదా, పల్లెల మీద మమకారం ఇంకా తగ్గలేదు. ఈ వర్షాల తో, నీళ్లు లేక, రుతుపవనాలు సరిగా రాక పడే అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈనాడు లో ఈ శీర్షక చూసు చాలా బాధేసింది. నా లాగే రైతు కుటుంబం నుంచీ వచ్చిన వాళ్లు ఈ బాధను తప్పకుండా అర్థం చేసుకున్తారనుకుంతా. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm.

అమ్మా...

అమ్మా...
ఎలా వున్నావు?
నేను గుర్తున్నానా?
నీ కొడుకుని
నవ మాసాలూ మోసి,
అల్లారుముద్దుగా పెంచిన,
నీ సుపుత్రుడ్ని.
ఒక చేత పిల్లల ఆలనా పాలనా
మరో చేతా వ్యవసాయం
ఆ రోజులు తలుచుకుంటేనే,
గుండె చెరువౌతుంది
ఇన్ని చేసీ నన్ను ఇంజనీరుని చేస్తే
ఇప్పుడు పలకరించేందుకు కూడా దగ్గరలేక
అవసరమొస్తే సాయమ్రాక
విదేశాల్లో విహరిస్తోన్న
నీ కొడుకుని.
గుర్తున్నానా?

Saturday, August 08, 2009

ఆహా...

అదిగో
మళ్ళీ
వినిపిస్తోంది

నా ఊహలకు రెక్కలు తొడిగి
రివ్వున ఎగరటం నేర్పే
సుమధురాలాపన

పండితుడూ
పామరుడూ
తేడా లేదు

మనిషా
పశువా
వ్యత్యాసం లేదు

జీవితాంతం
ఇలా
ఈ సుమధురగానం వింటూ
అలా వుందిపోవాలనిపిస్తుంది

ఎందుకిలా?

నిజంగా? నేనేనా?
నీతో ఊసులాడింది!
ఎన్నో బాసలు చేసింది!!

నిజంగా? నేనేనా?
నేనంటే నీవన్నది!
నువ్వంటే నా ప్రాణమన్నది!!

నిజంగా? నేనేనా?

ఎన్నో యుగాలైనట్లు
ఇది మరో జన్మన్నట్లు
ఎందుకిలా?

క్షమించు నేస్తం

నీలో ప్రేమించే హృదయమున్నట్లు
క్షమించే గునముందని నాకు తేలుసు

ఈ సిసిరమోచ్చినట్లే
మళ్ళీ వసంతం రాక మానదు

అంతవరకు వేచి
నన్ను మళ్ళీ నీ వాడిగా స్వీకరిస్తావని ఆశిస్తూ

----నీ నేను