Sunday, October 27, 2013

ఇళయరాజు

సుస్వరాల రాజు,
సినీసంగీత రారాజు.
ఆయన పాటలంటే నాకు మోజు,
వింటూ ఎంతో మైమరచాను ఈ రోజు.

తబలాతో నా మది తలుపు తడుతూ...
వేణువుతో సాగర సమీరంలా తోసుకొస్తాడు.
తెలుగు పద కన్నెలను గిటారుతో మీటుతూ...
పాశ్చాత్య సుగాసులోలకబోయిస్తాడు.

ఆయన సంగీతం వింటుంటే...
మనసు "ఆకాశంలో ఆశల హరివిల్లవుతుంది",
మాటలు "మౌనాలు" అవుతాయ్,
రోజులు "మళ్ళీ రాని రోజు"లు అవుతాయ్.

అయన సంగీత జ్ఞాని
మనకు ఆనంద ధుని
అందుకే...
ఆయన ఉండాలి,
నూరేళ్ళు నిండుగా
మనకందరికీ...
వీనులవిందుగా. 

Tuesday, October 01, 2013

'రాజ'కీయుడు

ఏమి దగా? ఎంత దగా?
లక్ష కాదు, కోటి కాదు
లక్ష కోట్ల దగా దగా

ఇరుగు లేదు! పొరుగు లేదు!!
వావివరసలడ్డుకాదు
మానవత్వమానవాలు లేదు.

రైతన్నను చంపేసేయ్
కూలీలను కాల్చేసేయ్
మనిషంటూ మాట్లాడితే
రాబందువలె రక్కెసెయ్
పొరుగువాడి సోమ్మునంతా
సుష్టుగా భొంచేసేయ్.

ఒకటి కాదు, రెండు కాదు
పది తరాలకు సరిపడగా
ఇతరుల సొమ్మంత,
దోచేసేయ్! దాచేసేయ్!!!

భూతంలా, ప్రేతంలా
అప్పుపడ్డ దైవంలా
లాగేసేయ్, గుంజేసేయ్

పిల్లలకు చదువులొద్దు
ముసలులకు వైద్యమొద్దు
బీదవాని బ్రతుకింకా
దరిద్రంలో ముంచేద్దు.

చావన్నది నీకుందని
మరచిపో, మురిసిపో
త్వరగా నీ చీకట్లో
నువ్వే కలసిపో

Thursday, May 02, 2013

నా ఆలొచనలు

నా ఆలొచనలు... అశ్వాలు 
ఆనందానికి అర్రులు చాస్తాయ్ 
అనుభూతి రెక్కలు ధరిస్తాయ్ 
భువినుండీ దివికెగరాలంటాయ్ 
అనంతలోకాలక దౌడుతీస్తాయ్ 

నా ఆలోచనలు... అశ్వాలు
అన్యాయాన్ని చూసి చలిస్తాయ్ 
న్యాయంకోసం సకిలిస్తాయ్ 
ఆవేశాన్ని మేస్తాయ్ 
ఆపై రౌద్రంగా కదంతోక్కుతాయ్ 

Sunday, October 14, 2012

ఆశాకిరణం


ఆశాకిరణం
-----------------------------------


పచ్చని పైరులు
పారే సెలయేరులు
ఆందమైన పల్లెటూర్లు
ఈవీ...స్వాత్ లొయ ఆనవాళ్ళు

ఉగ్రవాదం కాలుమోపింది
ఈ లొయ భీత హరిణ్యమైంది
స్త్రీ జాతికి చదువెందుకంటె?
చిగురుటాకల్లె ప్రజానీకం వణికిపొయింది

ఇంతలొ...ఒక శివంగి ఛెంగుమంది
ఈ అరాచకాన్ని ధిక్కరించింది
కటిక చీకటి కమ్ముతుంటె
అబలా లొకానికి ఆశా కిరణమయింది

ఛీడపురుగులు కారుమేఘాలై
ఆశా కిరణాన్ని ఆపుతున్నాయి
కానీ...
ఆశకెప్పుడు అంతు లేదు
యెన్నడు అది వోడిపొదు  

మా దీవెనలన్ని బలాన్నిస్తె
నీ ధైర్యం నీకు ప్రాణం పోస్తె
ఆ స్వాత్ లొయకు స్వాంతన తెస్తూ
ఈ పుడమి తల్లికి సంతొషాన్నిస్తూ
లే ఆమ్మ మలాల....
నువ్వు నిండు నూరెళ్లు జీవించాల

-- పాకిస్తాన్లొ ప్రాణాలతొ పొరాడుతున్న మలాల యుసుఫ్‌జాయి్ కోసం...

Tuesday, October 09, 2012

ప్రేమ


వారాంతం  
----------------------- 

శనివారం, ఒక ఘడియ
ఆదివారం, మరొ ఘడియ
నీ సాన్నిధ్యమా?
లేక నా భ్రమ?

కాఫీలు భలె కమ్మగుంటాయ్
వానలు నులి వెచ్చగుంటాయ్
నీ సహచర్యమా?
లెక ఇది సహజమా?

వారాంతాన్ని అనంతంలొ కలిపేసి
నీ కౌగిలిలొ ఆనందంగా గడిపేస్తె
అది మరొ అధ్యాయమా?
లెక మన ప్రేమలొ అమరత్వమా?